1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 జనవరి 2022 (13:12 IST)

దుష్ట పూర్వీకులు సమాజంపై రుద్దిన పాపిష్టి ఆచారమే వివాహం : రాంగోపాల్ వర్మ

చిత్రపరిశ్రమకు చెందిన సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగ విడిపోతున్నారు. ఇటీవల తెలుగు సినిమాకు చెందిన అక్కినేని నాగ చైతన్య, ఆయన భార్య, హీరోయిన్ సమంతలు విడిపోయారు. తాజాగా తమిళ చిత్రపరిశ్రమకు చెందిన స్టార్ హీరో ధనుష్, ఆయన సతీమణి, సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య దంపతులు విడాకులు తీసుకోనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీనిపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. "మన దుష్ట పూర్వీకులు సమాజంపై రుద్దిన పాపిష్టి ఆచారమే వివాహం. అసంతృప్తి, విచారంతో నిరంతరం కొనసాగేందుకే ఇది" అంటూ కామెంట్స్ చేశారు. 
 
అంతేకాకుండా, తన ట్విట్టర్ ఖాతా పేజీలో వివాహం గురించి అనేక ఘాటైన పోస్టులను ఆయన షేర్ చేశారు. "వివాహంతో కొని తెచ్చుకునే ప్రమాదాల గురించి యువతను హెచ్చరించేందుకు స్టార్ విడాకులు మంచి ట్రెండ్ సెట్టర్స్. విడాకులను సంగీత్ కార్యక్రమంతో వేడుకలా చేసుకోవాలి. ఎందుకంటే స్వేచ్ఛను పొందుతున్నందుకు" అని పేర్కొన్నారు.  
 
"ఒకరిలోని ప్రమాదకర లక్షణాలను మరొకరు పరీక్షించుకునేందుకే పెళ్లిళ్లు. ప్రేమను పెళ్లికి మించి వేగంగా చంపేసేది మరేదీ లేదు. సంతోషానికి రహస్యం ఏమిటంటే జైలుకు వెళ్లడంలాంటి పెళ్లి చేసుకోవడానికి కంటే వీలైనంత కాలం ప్రేమిస్తూ ఉండటమే ఉత్తమం" అంటూ రాంగోపాల్ వర్మ కామెంట్స్ చేశారు.