శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 జనవరి 2022 (12:20 IST)

'మాస్ మహారాజ్' రవితేజ హీరోయిన్‌ డింపుల్‌కు కరోనా పాజిటివ్

తెలుగు చిత్రపరిశ్రమలో 'మాస్ మహారాజ్' రవితేజ సరసన నటించిన హీరోయిన్ డింపుల్ హయాతి. ఈమెకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. పూర్తిగా టీకాలు వేసుకున్నప్పటికీ తనకు తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్నాయని ఆమె ట్వీట్‌లో వెల్లడించారు. 
 
ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు పేర్కొన్నారు. అలాగే, ఈ మధ్యకాలంలో తనతో కాంటాక్ట్ అయిన వారు విధిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఇకపోతే, తన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, కరోనా టీకాలు వేయించుకోవాలని కోరారు.
 
కాగా, రవితేజతో కలిసి ఆమె "ఖిలాడీ" చిత్రంలో నటించారు. ఈ చిత్రం త్వరలోనే విడుదలకానుంది. అలాగే, తమిళ హీరో విశాల్ నటించిన కొత్త చిత్రం "సామాన్యుడు"లోనూ డింపుల్ హయాతి నటించారు. ఈ చిత్రం తమిళ వెర్షన్ ట్రైలర్ లాంచ్ గత వారం చెన్నైలో జరిగింది. ఇందులో డింపుల్ హయాతి కూడా పాల్గొన్నారు. ఇక్కడే ఆమెకు కరోనా వైరస్ సోకివుండొచ్చని భావిస్తున్నారు.