సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 జనవరి 2022 (19:22 IST)

మరదలిపై మోహం .. భార్య - అత్త - అమ్మమ్మలపై ఉన్మాది కత్తితో దాడి

సభ్య సమాజంలో అపుడపుడూ అక్కడక్కడా కొన్ని సంఘటనలు తలదించుకునేలా ఉంటున్నాయి. ఓ వివాహితుడు తనకు మరదలి వరుసయ్యే భార్య చెల్లిపై వ్యామోహం పెంచుకున్నాడు. ఒకవైపు భార్యతో కాపురం చేస్తూనే మరోవైపు మరదలితో పడక సుఖానికి తహతహలాడాడు. ఈ విషయం తెలిసి మందలించిన భార్యతో అత్తపై కత్తితోదాడి చేశాడు. ఈ దారుణం తెలంగాణా రాష్ట్రంలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొండాపూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన ఓ వివాహితుడు మరదలిపై మనసు పారేసుకున్నాడు. ఆమెపై రోజురోజుకూ వ్యామోహం పెంచుకోసాగాడు. ఈ విషయాన్ని గ్రహించిన భార్య భర్తను మందలించి,  విషయాన్ని తన తల్లి, అమ్మమ్మకు చెప్పింది. 
 
అంతే.. ఒక్కసారిగా అగ్రహోద్రుక్తుడైన ఆ ఉన్మాది కత్తితో భార్య, అత్త, అమ్మమ్మపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.