1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 జనవరి 2022 (13:42 IST)

తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ

తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో కఠిన ఆంక్షలు విధించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధం అవుతుంది. ఇప్పటికే విద్యా సంస్థలకు 30వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించేందుకు సమాలోచనలు చేస్తోంది. రాత్రి 9 గంటల నుంచి కర్ఫ్యూ అమలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్‌లో ఆంక్షలు అమలు చేయాలని భావిస్తోంది. 
 
ఇప్పటికే రాష్ట్రంలో కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వైరస్ బారిన పడ్డారు. దీనికి తోడు ఒమిక్రాన్ కేసులు సైతం భారీగానే పెరుగుతున్నాయి. ప్రజలు కరోనా నిబంధనలు పట్టించుకోకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయన్న భావం ప్రభుత్వం వర్గాల్లో వ్యక్తమవుతోంది.