శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 19 జనవరి 2022 (17:22 IST)

64 ఏళ్ల వయసులోనూ అమ్మాయిని పెళ్లాడుతానంటూ పట్టు, పెట్రోల్ పోసుకున్నాడు

64 ఏళ్ల వయసు. భార్య చనిపోయింది. పిల్లలు దూరంగా వున్నారు. ఒంటరి జీవితం ఇంకెన్నాళ్లు అనుకున్నాడేమో ఆ వృద్ధుడు తను పెళ్లాడేందుకు ఓ అమ్మాయిని చూసి పెట్టమన్నాడు. అందుకు మ్యారేజ్ బ్యూరో అంగీకరించకపోవడంతో శరీరంపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు.

 
ఈ ఘటన జరిగింది ఇక్కడ కాదు. దక్షిణ కొరియాలో.. వివరాలు చూస్తే.. ఈ నెల 16న 64 ఏళ్ల వృద్ధుడు మ్యారేజ్ బ్యూరోకి వచ్చాడు. తనకు వివాహం చేసుకోవాలని వుందనీ, ఓ చక్కని అమ్మాయిని చూసి పెట్టాలంటూ వారిని కోరాడు. 64 ఏళ్ల వయసులో నీకు పెళ్లేంటి... అంటూ మ్యారేజ్ బ్యూరో సిబ్బంది సమాధానమిచ్చారు. దాంతో వారితో వాదనకు దిగాడు. 

 
ఎంతకీ వారు అంగీకరించకపోవడంతో తనతో తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ మూత తీసి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ హఠత్పరిణామానికి షాక్ తిన్న సిబ్బంది అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.