శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 జనవరి 2022 (22:29 IST)

చెన్నై చంద్రం త్రిషకు పెళ్లి.. ఎవరితో తెలుసా? (video)

చెన్నై చంద్రం త్రిష ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కనుంది. ఆమె గతంలో కొందరు హీరోలతో ఎఫైర్ నడిపి వార్తల్లోకెక్కింది. టాలీవుడ్ నటుడు రానాతో ఆమె ఘాటుగా ఎఫైర్ నడుపుతూ.. ఓ పబ్‌లో మందేసి మీడియాకు పబ్లిక్‌గా దొరికిపోయింది అన్న వార్తలు వచ్చాయి.
 
కొన్నేళ్ళ క్రితమే పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్‌తో ఆమె ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయితే వీరి బంధం పెళ్లి వరకు వెళ్లకుండానే పెటాకులు అయింది. గత నాలుగేళ్ల నుంచి త్రిష పెళ్లి గురించి రకరకాల వార్తలు వస్తున్నా అవి నిజం కావడం లేదు.
 
తాజాగా కోలీవుడ్ హీరో శింబు - త్రిష పెళ్లి చేసుకుంటున్నారు అన్న రూమర్ కూడా బయటకు వచ్చింది. శింబు కూడా గతంలో నయనతార - హన్సిక లాంటి హీరోయిన్లతో ఎఫైర్ నడిపిన విషయం తెలిసిందే. అలాంటిది ఇప్పుడు త్రిషతో మనోడి పెళ్లి అన్న వార్తతో చాలామంది షాకయ్యారు. అయితే ఇదంతా రూమర్ అని తర్వాత తేలింది. 
 
తాజాగా త్రిష పెళ్లి గురించి మరోసారి వార్తలు వస్తున్నాయి. నయనతార తరహాలోనే త్రిష కూడా కోలీవుడ్‌కు చెందిన ఓ డైరెక్టర్ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె వివాహంపై ప్రకటన చేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.