శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 జనవరి 2022 (11:26 IST)

డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ : ఇంజెక్షన్‌కు బైబై

డయాబెటిస్ రోగులకు ప్రముఖ ఫార్మ కంపెనీ శుభవార్తను అందించింది. ఇప్పటి వరకు ఇంజక్షన్ రూపంలోనే తీసుకునే ఔషధాన్ని ఇకపై ట్యాబ్లెట్ రూపంలో తీసుకునే సదుపాయాన్ని కల్పించింది.
 
ప్రపంచంలోనే తొలిసారిగా సెమాగ్లూటైడ్ ఔషధాన్ని నోవోనార్డిస్క్ సంస్థ మాత్ర రూపంలో భారత్‌లోకి తీసుకువచ్చింది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో బ్లడ్‌షుగర్‌ను అదుపులో ఉంచడం, బరువు తగ్గించడంలోనూ ఈ ఔషధం ఉపయోగపడుతుందని ఆ సంస్థ పేర్కొంది. 
 
కాగా ఈ ట్యాబ్లెట్‌కు 2019లోనే అమెరికాలో ఆమోదం లభించగా.. 2020 డిసెంబర్‌లో భారత్ ఆమోద ముద్ర వేసింది. ఇంజక్షన్ రూపంలోనే ఉన్న ఈ ఔషధాన్ని ట్యాబ్లెట్ రూపంలోనే తీసుకురావడానికి నోవోనార్డిస్క్ సంస్థ 15 ఏళ్లపాటు పరిశోధనలు చేసి విజయం సాధించింది.