శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (14:11 IST)

ఆశా వర్కర్లకు తెలంగాణ సర్కారు స్వీట్ న్యూస్

ఆశా వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కమీషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిపాలన కిందకు వచ్చే తెలంగాణలోని గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తల (ఆశా వర్కర్లకు) కార్మికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఆధారిత ప్రోత్సాహకాన్ని 30 శాతం పెంచింది. కరోనా విజృంభిస్తున్న వేళ సర్కారు ఆశావర్కర్ల పనితీరు ఆధారిత ప్రోత్సాహకాన్ని పెంచింది.
 
ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వు (జీవో ఎమ్‌ఎప్‌ నం 1)లో రాష్ట్ర ప్రభుత్వం నెలవారీ పనితీరు ఆధారిత ప్రోత్సాహకం గరిష్ట పరిమితిపై 30 శాతం చొప్పున పెంపుదల కోసం అనుమతిని ఇచ్చింది. దీంతో రూ.7, 500 నుండి రూ.9,750లకు నెలవారీ ప్రోత్సహకాలు పెరగనున్నాయి.
 
పనిభారం పెరుగుతున్నప్పటికీ వేతనాలు పెరగవని ఆశా కార్మికులు గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. వారి కనీస వేతనం చాలా తక్కువగా ఉంది.  వారు చేసే కృషికి కొంచెం ఎక్కువ డిమాండ్ చేశారు. అంతేకాకుండా, టిఎలు మరియు డిఎలను కూడా ఇవ్వమని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం పెరగడంతో ఆశా కార్మికులకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ కార్మికులకు ఉపశమనం ఉంది.