1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (13:54 IST)

ఆశావర్కర్లకు నెలవారీ ప్రోత్సాహకాలు 30 శాతం పెంపు

ఆశావర్కర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరికి నెలవారీగా ఇచ్చే వివిధ రకాల ప్రోత్సాహాల్లో 30 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కింద పని చేస్తున్న, నేషనల్ ఆరోగ్య మిషన్ కింద పనిచేస్తున్న ఆశావర్కర్లకు ఈ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నెలవారీ ప్రోత్సాహకాలలతో ఆశావర్కర్ల నెలవారీ జీతం కూడా పెరగనుంది. 
 
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ఆశావర్కర్లకు ఉకపై నెల వేతనం రూ.7500 నుంచి రూ.9750కు పెరగనుంది. పైగా, ఈ పెంచిన ప్రోత్సాహకాలను గత యేడాది జూన్ నెల నుంచి అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆశావర్కర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.