గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 డిశెంబరు 2021 (12:06 IST)

సంక్రాంతికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం సంక్రాంతికి ప్రజలకు అందుబాటులోకి రానుంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొంది, లేదా ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పించాలని నిర్ణయించారు. ప్రభుత్వ స్థలాలలో గృహ నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి రుణాలు తీసుకోకుండా ఇళ్లు నిర్మించుకున్న వారికి కూడా ప్రభుత్వం ఉచితంగా యాజమాన్య హక్కులు కల్పించనుంది. 
 
ఇంతవరకు బాగే ఉన్నా అసలు ట్విస్ట్ అక్కడే మొదలైంది. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వాళ్ళు, ఆ ఇంటికి సంబంధించిన రిజిస్టర్డ్ పత్రాలు లేని వాళ్లకు ఈ పథకం లబ్ది చేకూరిస్తే మంచిదే కానీ సొంత స్థలాలు ఉండి ప్రభుత్వ సహాయంతో హౌసింగ్ లోన్ తీసుకొని ఇళ్లు నిర్మించుకున్న వాళ్లకు సైతం సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగస్వాములను చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవడం చాలా గ్రామాలలో ప్రజల ఆగ్రహానికి కారణంగా మారింది.