సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 14 డిశెంబరు 2021 (16:26 IST)

జగన్ సర్కార్ గుడ్ న్యూస్: వృద్దాప్య పెన్షన్ రూ. 2500

ఏపీ సర్కారు వృద్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది నూతన సంవత్సరం కానుకగా వృద్ధాప్య పెన్షన్ రూ.2250 నుంచి మరో 250 రూపాయలు పెంచి రూ. 2500 ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీఎం జగన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో వెల్లడించారు.

 
గత 2019 ఎన్నికల సమయంలో వృద్ధాప్య పెన్షన్ నెలకి 3000 ఇస్తామని అప్పట్లో జగన్ ప్రకటించారు. ప్రస్తుతం ఆ దిశలో అడుగులు వేస్తున్నారు. వచ్చే జనవరి నుంచి రూ. 2500 పింఛన్ ఇస్తామని తెలియజేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.