శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 డిశెంబరు 2021 (13:19 IST)

ఏపీలో పదో తరగతి విద్యార్థులకు శుభవార్త: 11కు బదులు ఏడు పేపర్లే!

ఏపీలో పదో తరగతి విద్యార్థులకు శుభవార్త. కోవిడ్‌ కారణంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను ఈ ఏడాది కూడా ఏడు పేపర్లకు కుదించారు. 2022 మార్చిలో జరగనున్న 2021–22 విద్యాసంవత్సరపు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను 11 పేపర్లకు బదులు 7 పేపర్లలో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ జీవోను విడుదల చేశారు.
 
సామాన్యశాస్త్రం మినహా మిగతా అన్నీ సబ్జెక్టులకు ఒకే పేపర్‌ ఉంటుంది. ప్రతి పేపర్‌లో 33 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. సామాన్యశాస్రంలో భౌతిక, రసాయన శాస్త్రాలు ఒకటిగా 50 మార్కులకు.. జీవశాస్త్రం ఒకటిగా 50 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 3.15 గంటలుగా నిర్ణయించారు. 2021–22 విద్యాసంవత్సరంలో టెన్త్‌ పరీక్షలకు 6 లక్షల మందికి పైగా హాజరుకానున్నారు.