గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (19:07 IST)

పేదలకు శుభవార్త: రూ.35వేల అదనపు రుణం

ఏపీలోని సర్కారు పేదలకు శుభవార్త చెప్పింది. పేదలందరికీ ఇళ్లు పథకం లబ్దిదారులకు మొత్తం 15.6 లక్షల ఇళ్ల నిర్మాణానికి గానూ రూ. 35 వేల అదనపు రుణాన్ని తీసుకునేందుకు అనుమతిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. 
 
ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్. ఇలాంటి నిర్ణయం తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి సర్కార్‌పై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.