సోమవారం, 2 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 20 డిశెంబరు 2021 (17:32 IST)

ఆంధ్రప్రదేశ్‌లో స్వచ్ఛమైన తాగునీటి ప్లాంట్‌లను అమర్చిన హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌

తమ స్వచ్ఛ తాగునీటి కార్యక్రమంలో  భాగంగా హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌  సర్వీసెస్‌, తమ సీఎస్‌ఆర్‌ భాగస్వామి బాల వికాస సోషల్‌ సర్వీసెస్‌ సొసైటీతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో కమ్యూనిటీ నీటి శుద్ధి ప్లాంట్‌లను ఏర్పాటుచేసింది.

 
ఈ భాగస్వామ్యంతో హెచ్‌డీబీ, 63 కమ్యూనిటీ వాటర్‌ ఫ్యూరిఫికేషన్‌ ప్లాంట్స్‌ను ఏర్పాటుచేసింది. ఈ ప్లాంట్స్‌ను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలలో ఫ్లోరైడ్‌ ప్రభావిత జిల్లాల్లో అమర్చారు. వీటి ద్వారా 20వేల కుటుంబాలు సురక్షిత తాగునీటిని పొందగలుగుతున్నాయి.

 
ఈ పథక నిలకడతనాన్ని నిర్ధారిస్తూ కమ్యూనిటీలోని ప్రతి కుటుంబమూ నామమాత్రంగా ఒక్కసారి రిజిస్ట్రేషన్‌ ఫీజు 20 లీటర్లకు 5 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి వాటర్‌ ప్లాంట్‌నూ వాటర్‌ యూజర్‌ కమిటీ నిర్వహిస్తుంది. ఈ కమిటీ సభ్యులకు నీటి శుద్ధి కర్మాగారాల పట్ల పూర్తి శిక్షణను అందిస్తారు. ఇప్పటివరకూ అమర్చిన ప్లాంట్‌లన్నీ కూడా సంబంధిత కమ్యూనిటీలకు బదిలీ చేయడం జరిగింది.

 
ఈ కార్యక్రమం గురించి మోహన్‌ వంశీ పాలెం, జోనల్‌ మేనేజర్‌, హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ మాట్లాడుతూ, ‘‘ఫ్లోరైడ్‌ ప్రభావిత నీటిని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీనికారణంగా వైద్య ఖర్చులూ పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణా రాష్ట్రాలలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో స్వచ్ఛమైన తాగునీరు అనేది అత్యంత ఆందోళనకరమైన అంశంగా మారింది. బాల వికాసతో మా భాగస్వామ్యంతో బీద వర్గాల ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ప్రయత్నిస్తున్నాము. తద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్నీ నిర్మిస్తున్నాము’’ అని అన్నారు.

 
కమ్యూనిటీ నీటి శుద్ధి కర్మాగారాలు మొదలు పైప్‌ వాటర్‌ సరఫరా వ్యవస్థలను ఏర్పాటుచేయడం వరకూ హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ క్లీన్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ప్రోగ్రామ్‌ను నీటి లభ్యత, ప్రాప్యత, అందుబాటు ధరలకు బీద వర్గాల ప్రజలకు చేరువ చేయడానికి కట్టుబడి ఉంది. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, మధ్య ప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌,మహారాష్ట్రలలో  క్లీన్‌ డ్రింకింగ్‌ కార్యక్రమాలకు మద్దతునందిస్తుంది.