శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 డిశెంబరు 2021 (18:37 IST)

సర్కారు వారి ఆట : ఏపీఎఫ్‌డీసీకి సినిమా టిక్కెట్ల విక్రయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టిక్కెట్ల పంపిణీ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రామాభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ)కి అప్పగించింది. అంటే ఆన్‌‍లైన్ టిక్కెట్ అమ్మకాల బాధ్యతను పూర్తిగా ఏపీఎఫ్‌డీసీకి అనుబంధ సంస్థ ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు పూర్తి బాధ్యతలు కట్టబెడుతూ సీఎం జగన్ సర్కారు ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న అన్ని ప్రైవేటు సంస్థలను ఒకే వేదికపైకి తీసుకునిరావడం ఈ నోడల్ ఏజెన్సీ బాధ్యత. అలాగే, సినిమాటోగ్రఫీ చట్టానికి చేసిన సవరణలను అనుసరించి సినిమా టిక్కెట్ల అమ్మకాలకు తగిన నమూనాలను, విధి విధానాలను ఈ ఏజెన్సీ రూపొందించాల్సి ఉంటుంది. భారతీయ రైల్వే ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థ తరహాలోనే ఏపీలోనూ సినిమా టిక్కెట్ల విక్రయాలు సాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెల్సిందే.