శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 డిశెంబరు 2021 (13:30 IST)

మాతృభాషలో ఇంజనీరింగ్ కోర్సుల బోధన... ఎక్కడ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో మాతృభాషలో ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. తెలుగు మాధ్యమంలో ఇంజనీరింగ్ కోర్సు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఉన్న ఎన్ఆర్ఐ కాలేజీలో ఈ యేడాది కంప్యూటర్ సైన్స్ (సీఎస్ఈ) కోర్సును మొదలుపెట్టింది. 
 
భారతీయ భాషల్లో సాంకేతి విద్యను అందించేలా కొత్త జాతీయ విద్యా విధానం 2020కు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) రూపకల్పన చేసింది. ఇందులోభాగంగా, దేశవ్యాప్తంగా 20 కాలేజీలకు అనుమతి ఇచ్చింది. తెలుగు మాధ్యంలో ఏపీ నుంచి ఎన్ఆర్ఐ కాలేజీకి అనుమతి ఇచ్చింది. 
 
ఇందులో తెలుగు మాధ్యమంలో మొత్తం 60 సీట్లను కేటాయించింది. కన్వీనర్ కోటాలో మరో 20 మంది, స్పాట్ కింద మరో 11 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. వీరికి తరగతులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రాంతీయ భాషల్లో బోధనకు అవసరమైన పుస్తకాలను ఏఐసీటీఈ సరఫరా చేసింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ (ఎన్.బి.ఏ) గుర్తింపు ఉన్న కోర్సులకో ప్రాంతీయ భాషల్లో సెక్షన్లకు అనుమతించింది.