గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 డిశెంబరు 2021 (19:01 IST)

మద్యం పన్నుల్లో హేతుబద్దత : ఏపీలో తగ్గనున్న ధరలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మద్యంబాబులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మద్యం ధరను తగ్గించనుంది. దీనికి కారణం మద్యం పన్నుల్లో హేతుబద్దతను తీసుకొచ్చింది. అంటే మద్యం పన్న రేట్లలో మరోమారు మార్పులు చేసింది. దీంతో మద్యం ధరలు తగ్గనున్నాయి. 
 
ఈ మేరకు ఏపీ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మద్యంపై వసూలు చేస్తున్న వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ మార్జిన్‌లలో హైతుబద్ధత తీసుకు రావడం వల్ల ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్‌ బ్రాండ్లపై 5-12 శాతం మేరకు ధరలు తగ్గనున్నాయి. 
 
అక్రమ మద్యం, నాటుసారా తయారీని అరికట్టేందుకే మద్యం ధరలను తగ్గించినట్టు పేర్కొన్నారు. అలాగే, వచ్చే వారం నుంచి ప్రముఖ కంపెనీల బ్రాండ్లకు చెందిన మద్యం విక్రయాలను కూడా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.