శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 డిశెంబరు 2021 (17:54 IST)

ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగాలి : బీజేపీ ఎంపీ జీవీఎల్

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్. నరసింహా రావు స్పష్టంచేశారు. పైగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి అని కేంద్రం కూడా అంగీకరించిందని ఆయన గుర్తుచేశారు. 
 
ఇదే అంశంపై ఆయన శనివారం మాట్లాడుతూ, ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగాలన్నదే బీజేపీ స్టాండ్ అని స్పష్టంచేశారు. అయితే, రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో కూడా చెప్పారని, ఇందుకు తాము ఏకీభవిస్తామన్నారు. 
 
అంతేకాకుండా, రాయలసీమ ప్రాంత అభివృద్ధికి బీజేపీ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయినవారిలో ఎక్కువ మంది రాయలసీమ ప్రాంత వాసులేనని, కానీ, ఆ ప్రాంత అభివృద్ధిపై వారు దృష్టిసారించలేదని చెప్పారు. ప్రధానంగా అనంతపురం జిల్లా బాగా వెనుకబడివుందని గుర్తుచేశారు. అందుకే  ఈ ప్రాంత అభివృద్ధిపై తమ పార్టీ ప్రత్యేక దృష్టిసారిస్తుందని చెప్పారు.