శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 16 డిశెంబరు 2021 (15:43 IST)

పీఆర్సీ నివేదిక ఇవ్వకున్నా ఇబ్బంది లేద‌ని...నేనెపుడ‌న్నా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఉద్యోగుల పి.ఆర్.సి. నివేదిక చుట్టూ ఇపుడు ఉద్యోగ సంఘాల రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. చివ‌రికి ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు కె  వెంకటరామిరెడ్డి ఆంధ్రజ్యోతి దిన‌ప‌త్రిక‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను అనిన మాటల‌ను తాను అన్న‌ట్లు ఆ ప‌త్రిక ప్ర‌చురించ‌డం అన్యాయ‌మ‌ని చెప్పారు.
 
 
ఆంధ్రజ్యోతి దినపత్రికలో "పీఆర్సీ నివేదిక ఇవ్వకున్న ఇబ్బంది లేదు" అనే శీర్షికతో నా గురించి ప్రచురించిన కథనం అవాస్తవం. నేను చెప్పని  మాటలను చెప్పినట్లుగా ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.  పి.ఆర్.సి. నివేదిక బయట పెట్టకుండా  పి.ఆర్.సి. అమలు చేయడం సాధ్యం కాదు కాబట్టి కచ్చితంగా పి.ఆర్.సి. నివేదిక బయట పెట్టాల్సిందే అని మేము మొద‌టి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ వాస్తవాన్ని గమనించకుండా ఆంధ్రజ్యోతి పత్రిక ఈ అసత్య  కథనాన్ని ప్రచురించడం బాధాకరం.   ఆంధ్రజ్యోతి పత్రిక ఈ విషయాన్ని  తన రేపటి సంచికలో ప్రముఖంగా ప్రచురించడంతో పాటు  పశ్చాత్తాపం వ్యక్తపరచవలసిందిగా కోరుతున్నామ‌ని కె  వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.