1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 డిశెంబరు 2021 (12:34 IST)

ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ బస్సులో మంటలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సుల అధ్వాన్నస్థితిని ఆ రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాలు రుజువు చేస్తున్నాయి. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా జల్లేరు వాగులో పల్లెవెలుగు బస్సుపడిపోయిన ప్రమాదంలో 10 మంది సజీవంగా జలసమాధి అయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన 24 గంటలు కూడా గడవకముందే.. గురువారం ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెంలో ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. ఈ మంటలధాటికి ఆ బస్సు పూర్తిగా కాలిపోయింది. 
 
గురువారం తెల్లవారుజామున తిమ్మరాజుపాలెం వద్ద బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దీన్ని గ్రహించిన బస్సు డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేసిం కిందకు దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ మంటలు బస్సు మొత్తం అంటుకుని బస్సు పూర్తిగా కాలిపోయింది. 
 
అయితే, ప్రయాణికుల సామాగ్రి కూడా బస్సులోనే కాలి బూడిదైపోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.