సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 20 డిశెంబరు 2021 (18:12 IST)

ఏపీ సచివాలయంలో మెగా హెల్త్ క్యాంపు... ముఖ్య అతిథి అజేయ కల్లం

ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ సంఘం, ఆంధ్ర ప్రదేశ్ ఆయుష్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో   సచివాలయంలో ఈనెల 21 తేదీ నుంచి 24వ తేదీ వరకు ఆయుర్వేద వైద్యానికి సంబంధించి మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ మెగా హెల్త్ క్యాంపులో 10 మంది ఆయుర్వేద వైద్య నిపుణులు 5 మంది హోమియో వైద్య నిపుణులు 5 మంది యోగా గురువులతో పాటు మొత్తం 40 మంది వైద్య బృందం పాల్గొని సచివాలయ ఉద్యోగులకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందిస్తారు.  ఇందులో వైద్య సేవల‌తోపాటు మందులు అన్నీ ఉచితంగా అందించనున్నారు.  

 
ఈ ఆయుర్వేద మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం ఉదయం 11 గంటలకు మూడో బ్లాక్ లోని అసోసియేషన్ హాల్ లో జ‌రుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాల‌ని, మీడియా కూడా ఈ వైద్య సౌకర్యాన్ని వినియోగించుకోవల్సిందిగా ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు కె.వెంకట రామిరెడ్డి కోరారు.