మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 డిశెంబరు 2021 (17:19 IST)

ఉద్యోగుల విభజనపై క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్

తెలంగాణా రాష్ట్రంలో అనేక కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. దీంతో కొత్తగా జోన్లను ఏర్పాటు చేయడంతో ఉద్యోగుల విభజన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. తెలంగాణాలో కొత్త జోనల్ ప్రకారమే ఉద్యోగుల విభజన జరుగుతుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. 
 
ఆయన శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా అన్ని జిల్లాల కలెక్టర్లు పని చేయాలని కోరారు. మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగులు పని చేస్తే రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి జరుగుతుందని ఆయన చెప్పారు. 
 
స్థానిక యువతకు యువతకు ఉద్యోగులు కల్పించే అంశంపై సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని కోరారు. స్థానికులకు ఉద్యోగాలు దక్కాలన్న ఏకైక ఉద్దేశంతోనే జోనల్ వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు.