శుక్రవారం, 18 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 డిశెంబరు 2021 (22:19 IST)

తెలంగాణలో ఒమిక్రాన్ కలకలం: రెండో డోస్ వేసుకున్నా..?

తెలంగాణలో ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. తెలంగాణలో తాజాగా నలుగురికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఏడుకి పెరిగింది.  
 
కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 40,103 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 190 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 80 కొత్త కేసులు నమోదు కాగా... రంగారెడ్డి జిల్లాలో 14, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 13, హన్మకొండ జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి. 
 
మరోవైపు దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి కొనసాగుతోంది. కర్ణాటకలోనూ మరో ఐదు కేసులు వెలుగుచూశాయి. వీరందరూ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారే కావడం ఆందోళన కలిగిస్తోంది.
 
ఇప్పటివరకు మహారాష్ట్రలో 32, రాజస్థాన్ లో 17, ఢిల్లీలో 10, కర్ణాటకలో 8, తెలంగాణలో 7, కేరళలో 5, గుజరాత్ లో 5 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో 1, చత్తీస్ గఢ్ లో 1, తమిళనాడులో 1 ఒమిక్రాన్ కేసును గుర్తించారు. ఈ క్రమంలో, దేశంలో కొత్త వేరియంట్ కారణంగా నమోదైన కేసుల సంఖ్య 87కి చేరింది.