బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 డిశెంబరు 2021 (17:17 IST)

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం పరీక్షా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఫస్టియర్‌లో ఫలితాల్లో భాగంగా 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం ఉత్తీర్ణత సాధించారని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. 
 
ప్రస్తుతం సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు ఫస్టియర్ ఇయర్ పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే.  
 
ఈ నేపథ్యంలో ఈ రోజు విడుదలైన పరీక్షా ఫలితాలను  http://tsble.cgg.gov.in సైట్ ద్వారా పొందవచ్చు. మార్కుల మెమోలను 17వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు.