1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Banks' Staff To Go On Two-Day Strike From Today and tomorrow

నేడు - రేపు తెలంగాణాలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె

Bank Staff
తెలంగాణ రాష్ట్రంలో 70 వేల మంది బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల పాటు సమ్మె తలపెట్టారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గురువారం, శుక్రవారాల్లో సమ్మెకు దిగుతున్నారు. ఈ మేరకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ ఫోరం కన్వీనర్ శ్రీరాం, అఖిల భారత బ్యాంకు అధికారుల కాన్ఫడరేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.నాగేశ్వర్ తెలిపారు. 
 
ఈ బ్యాంకుల సమ్మె హైదరాబాద్ నగరంలోని కోఠిలో ప్రారంభమవుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులతో పాటు.. గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు కూడా పాల్గొంటారని వారు తెలిపారు. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలన్న ఏకైక లక్ష్యంతో కేంద్రం కుట్రలు చేస్తుందని దానిని అడ్డుకునేందుకు రెండు రోజుల పాటు దేశ వ్యాప్త సమ్మె చేపట్టినట్టు తెలిపారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
తిరుమల కనుమ రోడ్డులో ఇద్దరు మోటారిస్టులపై చిరుత దాడి