శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (10:51 IST)

రూ.30 లక్షల వ్యయంతో 100 సిసిటివి కెమెరాలతో నెట్‌వర్క్

ఆసిఫ్ నగర్ పోలీసు డివిజన్‌లోని నాలుగు పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన 100 సిసిటివి కెమెరాల నెట్ వర్క్‌ను నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మంగళవారం ప్రారంభించారు. హుమాయూన్ నగర్, ఆసిఫ్ నగర్, లాంగర్ హౌజ్, గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యమైన ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేశారు. 
 
ఈ సందర్భంగా అంజనీ కుమార్ మాట్లాడుతూ కమ్యూనిటీ భాగస్వామ్యంతో రూ.30 లక్షల వ్యయంతో కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. "నగరంలోని రహదారులు మరియు ప్రాంతాలపై క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నేరాల రేటును అదుపులోకి తేవడం సులభమని తెలిపారు. సిసిటివి కెమెరా ఫుటేజ్ సహాయంతో కేసులను సులభంగా గుర్తించవచ్చు. ఇది చట్టాన్ని ఉల్లంఘించేవారిని నిరోధిస్తుందని అంజనీ కుమార్ తెలిపారు. 
 
'నేను సైతం' ప్రాజెక్టులో భాగంగా ప్రజలు ముందుకు వచ్చి తమ పరిసరాల్లో నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాలని కమిషనర్ కోరారు. ఏదైనా నేరానికి పాల్పడిన నేరస్థుడిని గుర్తించడానికి, అతడిని అరెస్ట్ చేయడానికి గతంలో అనేక బృందాలను ఏర్పాటు చేశారని, ఇప్పుడు నిఘా కెమెరా ఫుటేజ్‌తో సహా సాంకేతికపరిజ్ఞానాన్ని ఉపయోగించే కొద్దిమంది అదే పనిని చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.