గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 డిశెంబరు 2021 (16:01 IST)

రైతులకు తెలంగాణ సర్కారు షాక్.. వరి వద్దంటే పండిస్తారా?

రైతులకు తెలంగాణ సర్కారు షాకిచ్చేందుకు సిద్ధంగా వుంది. యాసంగిలో వరి పంట వేసే రైతులకు రైతు బంద్ కట్ చేయాలని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వరి పంట సాగు చేయని రైతులకే.. అంటే వరి స్థానంలో ఇతర పంటలు వేసిన రైతులకే రైతుబంధు ఇచ్చే దిశగా కేసీఆర్ సర్కార్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
 
ప్రభుత్వం సూచనలు చేసినప్పటికీ తెలంగాణ రైతాంగం పూర్తిగా వరి ధాన్యాన్ని పండిస్తు ఉండడంతో. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రేపు రైతుబంధుపై సీఎం కేసీఆర్.. సమీక్ష నిర్వహించనున్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఒకవేళ కేసీఆర్ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తే రైతుల నుండి వ్యతిరేకత రావడం ఖాయం అని అంటున్నారు. 
 
ఇప్పటికే వరి కొనుగోలు విషయంలో సర్కార్‌పై రైతులు ఆగ్రహంగా వున్నారు. దీనిపై ప్రకటన వస్తే మాత్రం రైతుల నుంచి తెలంగాణ సర్కారుకు ఇబ్బందులు తప్పవని టాక్ వస్తోంది.