1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. good news to inter first year students

ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

good news
ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు తెలంగాణ సర్కారు మరో గుడ్ న్యూస్ తెలిపింది. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కోసం ధరఖాస్తు చేసుకున్న వారు... తమ దరఖాస్తును రద్దు చేసుకోవడానికి శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించింది. దీని కోసం చెల్లించిన ఫీజును తిరిగి పొందవచ్చని ప్రకటించింది. 
 
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కాలేజీ ప్రిన్సిపాళ్ల వద్ద నుంచి డబ్బును తీసుకోవచ్చని తెలిపింది. అంతేకాదు ఈరోజు నుంచి విద్యార్థులంతా మార్కుల మెమోలను పొందవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ tsbie.cgg.gov.in నుంచి మెమోలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
తర్వాతి కథనం
12 మంది బాలికలపై ట్యూటర్ అత్యాచారం... నల్గొండ కోర్టు సంచలన తీర్పు