గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 జనవరి 2022 (09:23 IST)

అభ్యర్థుల వ్యయపరిమితిని పెంచిన ఎన్నికల సంఘం

భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖర్చు పెట్టే వ్యయ పరిమితిని పెంచింది. అంటే, ఇకపై పెద్ద రాష్ట్రాల్లో లోక్‌సభ అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచార ఖర్చు కింద రూ.95 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.54 లక్షల చొప్పున ఖర్చు చేయొచ్చు. అలాగే, పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ అభ్యర్థులు రూ.40 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.28 లక్షలు చొప్పున ఖర్చు చేసేలా వ్యయపరిమితిని ఎన్నికల సంఘం నిర్ణయించింది. 
 
ఇకముందు దేశ వ్యాప్తంగా జరుగబోయే అన్ని ఎన్నికలకు ఈ కొత్త వ్యయపరిమితి వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ కూడా గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా జారీచేసింది. ఈ యేడాది ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాల్సివుంది. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల వ్యయపరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.