శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (23:21 IST)

కరకరలాడే అప్పడాలతో సబ్జీని టేస్ట్ చేశారా?

Papad Ki Sabzi Recipe
కరకరలాడే అప్పడాలు అంటే పిల్లలకు చాలా ఇష్టం. అలాంటి అప్పడాలతో వెరైటీగా సబ్జీ చేస్తే ఎలా వుంటుందో ఓసారి టేస్ట్ చేసి చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:
అప్పడాలు - ఆరు 
పెరుగు - ఒక కప్పు 
ధనియాల పొడి- ఒక స్పూన్ 
సన్నగా తరిగిన పచ్చిమిర్చి - ఒక  స్పూన్
నీరు, ఉప్పు - తగినంత 
మెంతులు- అరస్పూన్ 
ఇంగువ- చిటికెడు 
పసుపు - పావు స్పూన్ 
కారం - పావు స్పూన్ 
మెంతి ఆకులు - పావు స్పూన్ 
 
తయారీ విధానం:
ముందుగా అప్పడాలను వేయించి పక్కనబెట్టుకోవాలి. తర్వాత ఓ పాన్‌లో నూనె వేసి మెంతులు వేసి వేపాలి. మిర్చి ముక్కలు, ఇంగువ జత చేయాలి. కాస్త మంట తగ్గించి పసుపు, కారం, ధనియాల పొడి కలపాలి. అందులోనే ఒక కప్పు నీళ్లు పోసి, ఉప్పు కలపాలి. పెరుగు వేసి ఉడికించాలి. కూరలా అయ్యాక అప్పడాలను అందులో తుంచి వేయాలి. మెంతి ఆకులను కూడా కలుపుకోవాలి. మూతపెట్టి నాలుగు నిమిషాల తర్వాత దించేస్తే అప్పడాల సబ్జీ రెడీ. అవసరమైతే ఓ గరిటెడు ఉడికించిన పప్పు, తరిగిన టమోటా, వెల్లుల్లి పాయలను గ్రేవీ కావాల్సినంత జత చేసుకోవచ్చు. టేస్టు అదిరిపోతుంది. ఈ అప్పడాల సబ్జీని పూరీలు, చపాతీల మీదకు సైడిష్‌గా వడ్డిస్తే టేస్టు అదిరిపోతుంది.