కాకినాడ కాజా - మాడుగుల హల్వాకు అరుదైన గుర్తింపు...
దక్షిణ భారతదేశంంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ఆదరణ కలిగిన కాకినాడ కాజాకు అరుదైన గుర్తింపు లభించింది. వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ కాకినాడ గొట్టం కాజాను నేటితరం యువతీయువకులు గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక పోస్టల్ స్టాంపు (తపానా బిళ్ళ)ను భారత తపాలా శాఖ విడుదల చేసింది. అలా వందేళ్లకుపైగా ప్రాచూర్యంలో ఉన్న ఈ కాకినాడ కాజాకు అరుదైన గుర్తింపు లభించింది.
ఈ కాకినాడ కాజాను తొలిసారి 1891 సంవత్సరంలో తయారు చేశారు. కోటయ్య అనే వ్యక్తి ఈ కాజాను తొలిసారి తయారు చేసి పేరుగడించారు. ఆ తర్వాత 2018లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జియోగ్రాఫిక్ ఇండికేషన్ సౌకర్యం కల్పించి అంతర్జాతీయంగా విస్తృత ప్రచారం కల్పించింది.
ఇపుడు భారత తపాలా శాఖ ఈ కాజాతో పాటు మాడుగుల హల్వా విశిష్టతను సైతం పోస్టల్ కవర్ ద్వారా మరింత వెలుగులోకి తెచ్చింది. విశాఖ జిల్లా మాడుగుల వేదికగా 1890లో తొలిసారి ఈ హల్వాను తయారు చేశారు. ఈ హల్వాకు లైంగిక సామర్థ్యం పెంచే గుణం కూడా ఉన్నట్టు అంతర్జాతీయంగా ప్రచారంలో ఉంది.