గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 జనవరి 2022 (14:07 IST)

హైదరాబాద్‌కు మకాం మార్చనున్న అజిత్!?

కోలీవుడ్ హీరో అజిత్‌కు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావలసిన 'వలిమై' కరోనా కారణంగా వాయిదా పడింది. ఇటీవల కాలంలో అజిత్ హైదరాబాద్‌పై ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారని తెలిసింది. 
 
తన సినిమాల షూటింగులు ఇక్కడే జరగాలని ఆయన కోరుకుంటున్నారట. అజిత్ పుట్టి పెరిగింది సికింద్రాబాద్‌లోనే. ఆయన 'వలిమై' షూటింగు కూడా ఎక్కువగా హైదరాబాద్‌లోనే జరిగింది. ఆ తరువాత సినిమాను కూడా ఆయన ఇక్కడే మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడని చెప్పుకుంటున్నారు.
 
అజిత్ తన తదుపరి సినిమాను కూడా వినోద్‌తోనే చేయనున్నాడని అంటున్నారు. మొత్తానికి హైదరాబాదుకు మకాం మార్చాలనుకుంటున్నారని తెలిసింది.