బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జనవరి 2022 (09:35 IST)

ఆ జిల్లాకు అక్కినేని నాగేశ్వరరావు పేరు పెట్టండి.. అభిమానులు

ఏపీలో జిల్లాల ఏర్పాటు జరిగిన నేపథ్యంలో టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పేరు తెరమీదకు వచ్పెచింది. మా జిల్లాకు ఏఎన్నార్ పేరు పెట్టమని ఏపీ సర్కారుకు అక్కినేని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏఎన్నార్ కళారంగానికి చేసిన సేవలకు గాను ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
 
జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పడనున్న కొత్త జిల్లా మచలీపట్నం. ఈ జిల్లాకు దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరు పెట్టాలని అక్కినేని అభిమానులు అభ్యర్ధన చేస్తున్నారు. ఏపీ సర్కార్ తమ కోరికను దృష్టిలో పెట్టుకోవాలని ఆలిండియా అక్కినేని అభిమాన సంఘం అధ్యక్షుడు సర్వేశ్వరరావు కోరుతున్నారు. 
 
గుడివాడ రామపురంలో జన్మించిన  అక్కినేని నాగేశ్వరరావు తెలుగు ప్రేక్షకులకు ఎంత దగ్గరి వారో గుర్తుంచుకోవాలని సర్వేశ్వరరావు పేర్కొన్నారు. సినీ రంగంలో చేసిన సేవకు దాదాఫాల్కే అవార్డు వంటి అనేక అవార్డులు అందుకున్నారు.