శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 జనవరి 2022 (16:04 IST)

ప్రియుడినే పెళ్లాడిన నాగిని స్టార్.. గోవాలో డుం డుం డుం

Mouni Roy
టీవీ, సినీ నటిగా, సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది మౌనీ రాయ్. ముఖ్యంగా "నాగిన్" సీరియల్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. తెలుగులో ‘నాగిని’ పేరుతో టెలికాస్ట్ చేశారు. అభిషేక్ బచ్చన్ ‘రన్’ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కె.జి.యఫ్‌ హిందీ వర్షన్‌లోనూ స్పెషల్ సాంగ్ చేసింది. 
 
ఈ నేపథ్యంలో పాపులర్ బాలీవుడ్ నటి మౌనీ రాయ్ ప్రియుడినే పెళ్లాడింది. గురువారం తన బాయ్‌ఫ్రెండ్ సూరజ్ నంబియార్‌తో గోవాలో మలయాళీ సాంప్రదాయం ప్రకారం మౌనీ-సూరజ్ ఒక్కటయ్యారు. 
 
ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. దుబాయ్‌లో సెటిల్ అయిన సూరజ్‌తో గతకొంత కాలంగా రిలేషన్‌లో ఉంది మౌనీ రాయ్. తాజాగా ఆమె ప్రియుడినే పెళ్లాడింది. 
 
మౌనీ రాయ్ మ్యారేజ్ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు మౌనీ రాయ్-సూరజ్ నంబియార్ కపుల్‌కి విషెస్ తెలియజేస్తున్నారు.