గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 జనవరి 2022 (15:49 IST)

ఇస్మార్ట్ శంక‌ర్ హీరోయిన్‌తో శింబు పెళ్లి..?

శింబు సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌లో ఒక‌రు. ఆయ‌న పెళ్లి పుకార్లు ఎప్పుడూ ఇంట‌ర్నెట్‌లో సంద‌డి చేస్తూనే ఉన్నాయి. తాజాగా శింబు, నిధి అగర్వాల్‌ను పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. త్వ‌ర‌లో శింబు త‌న వివాహ వివ‌రాల‌ను అభిమానులు, శ్రేయోభిలాషుల కోసం ప్ర‌క‌టించ‌నున్నారని టాక్ వస్తోంది. 
 
కాగా టాలీవుడ్ అగ్ర‌ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన పూరిజ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కించిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా విజ‌యం సాధించిన సంగతి తెలిసిందే. అయితే అందులో హీరో రామ్ పోతినేని న‌టించ‌గా.. హీరోయిన్‌గా నిధి అగ‌ర్వాల్ న‌టించారు.
 
ప్రస్తుతం నిధి అగ‌ర్వాల్‌, స్టార్ హీరో శింబు త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ పుకార్ల‌పై శింబు కానీ, నిధి కానీ స్పందించ‌క‌పోవ‌డంతో వీరి ప్రేమాయ‌ణం, పెళ్లిపై మాత్రం అంత‌గా క్లారిటీ లేదు. కానీ విరిద్ద‌రూ 2022లోనే వివాహం చేసుకునే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.