శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం గేట్ వద్ద చిరుత
శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం గేట్ దగ్గర అర్ధరాత్రి చిరుతపులి హల్ చల్ చేసింది. ఈ దృశ్యాలను ఎస్.పి.ఎఫ్ సిబ్బంది గమనించి వారి దగ్గర ఉన్న సెల్ ఫోన్‌లో బంధించారు.
చిరుతను చూసిన సెక్యూరిటీ సిబ్బంది, రాత్రి విధులు నిర్వహిస్తున్న జలవిద్యుత్ కేంద్రం ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు.
అయితే ఇప్పటికి అదే ప్రాంతంలో రెండుసార్లు చిరుతపులి సంచరించడం.. దగ్గరలోనే అటవీప్రాంతం ఉండటంతో సెలలు దగ్గర చిరుతలు నీళ్లు తాగడానికి వస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
చిరుతపులి ఇప్పటికే రెండు మూడుసార్లు వచ్చినా ఎవరిపై దాడి చేయలేదు. అయినా అధికారులు మాత్రం రాత్రి సమయంలో విధులు నిర్వహించే సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.