సంబంధిత వార్తలు
- వీధి కుక్కలకు ఆహారం వేసేందుకు బయటకొచ్చిన మహిళ: ప్రైవేట్ పార్ట్ చూపించిన పోలీసు
- బికినీలో పూజా హెగ్డె, కుక్కతో సమంత
- మంకీ వర్సెస్ డాగ్స్ గ్యాంగ్ వార్: 250 కుక్కలను చంపిన రెండు కోతులు
- తిరుమల కనుమ రోడ్డులో ఇద్దరు మోటారిస్టులపై చిరుత దాడి
- ఈ కుక్కను చూస్తే వర్కవుట్ చేయాలన్న కిక్ వస్తుంది, ఓ లుక్ వేయండి మరి
గేటుపైకెక్కి కూర్చున్న చిరుత.. కుక్కను నోట కరుచుకొని..?
జన జీవనంలోకి వన్య ప్రాణులు రావడం మామూలైపోయింది. అడవికి దగ్గరగా ఉన్న గ్రామాల్లోకి చిరుతలు వచ్చి భయపెడుతున్నాయి. ఓ ఇంట్లోని పెంపుడు శునకం గేటు ముందు నిలబడి పెద్దపెద్దగా మొరుగుతుంది. రాత్రి వేళ కావడంతో ఎవరూ దానిని పెద్దగా పట్టించుకోలేదు.
అయితే మొరుగుతున్న కుక్క ఉన్నట్టుండి పరుగులు తీసింది. వెంటనే ఓ చిరుత వీధి గేటు దూకిలోనికి వచ్చి కుక్కను నోట కరుచుకొని వచ్చిన దారిన వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియోను పర్విన్ కస్వాన్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు.
జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో చాలా మంది తమ పెంపుడు జంతువుల మెడకు పదునైన ముళ్లు కలిగిన బెల్టులు తగిలిస్తున్నారు.
తర్వాతి కథనం
