బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఫ్లాష్ బ్యాక్ 2021
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 27 డిశెంబరు 2021 (20:47 IST)

2021లో దేశంలో కోవిడ్ 19 ఏయే రాష్ట్రంలో ఎంతమందిని పొట్టనబెట్టుకున్నదో తెలుసా?

కోవిడ్ 19 మహమ్మారి తన రూపురేఖలను రకరకాలుగా మార్చుకుంటూ మానవాళిపై విరుచుకపడుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి తన ధాటిని కొనసాగిస్తూ లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. ప్రస్తుతం ఒమిక్రాన్, డెల్మిక్రాన్ అంటూ తన రూపు మార్చుకుని విజృంభిస్తోంది.

 
మనదేశం విషయానికి వస్తే 2021 ప్రారంభం నుంచి ఇప్పటివరకూ మొత్తం 3 కోట్ల 48 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా 4 లక్షల 80 వేల మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రాలవారీగా వివరాలు ఇలా వున్నాయి.

 
మహారాష్ట్ర 66.6 లక్షల కరోనా కేసులతో అగ్రస్థానంలో నిలవగా 1.41 లక్షల మంది బలయ్యారు. ఆ తర్వాత కేరళలో 52.4 లక్షలు కేసులు నమోదైతే 46,586 మంది చనిపోయారు. మూడోస్థానంలో కర్నాటక రాష్ట్రం నిలిచింది. ఆ రాష్ట్రంలో 30 లక్షల కేసులకు గాను 38,312 మంది చనిపోయారు.

 
తమిళనాడులో 27.4 లక్షల కేసులు నమోదైతే 36,735 మంది కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20.8 లక్షల కేసులకు 14,490 మంది మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 17.1 లక్షల కేసులకు 22,915 మంది చనిపోయారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 16.3 లక్షల కేసులకు 19,716 మంది బలయ్యారు.

 
ఢిల్లీలో 14.4 లక్షల కేసులకు 25,105 మంది, ఒడిషాలో 10.5 లక్షలకు 8,452 మంది, చత్తీస్ ఘర్ లో 10.1 లక్షలకి 13,597 మంది, రాజస్థాన్ 9.55 లక్షలకి 8,963 మంది, గుజరాత్ 8.29 లక్షలకి 10,113 మంది, మధ్యప్రదేశ్ 7.94 లక్షలకి 10,532 మంది ప్రాణాలు కోల్పోయారు.

 
హర్యానాలో 7.73 లక్షలకి 10,062 మంది, బీహార్ రాష్ట్రంలో 7.26 లక్షల కేసులకి 12,094 మంది, తెలంగాణలో 6.81 లక్షల కేసులకి 4,022 మంది, అస్సాంలో 6.2 లక్షల కేసులకి 6,156 మంది, పంజాబ్ రాష్ట్రంలో 6.04 లక్షల కేసులకి 16,638 మందిని కరోనా వైరస్ కాటేసింది.

 
జార్ఖండ్ రాష్ట్రంలో 3.5 లక్షల కేసులకి 5,142 మంది, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 3.45 లక్షల కేసులకి 7,416 మంది, జమ్ము-కాశ్మీర్ రాష్ట్రంలో 3.41 లక్షల మందికి 4,523 మంది చనిపోయారు.