ఆదివారం, 19 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : శనివారం, 18 అక్టోబరు 2025 (16:47 IST)

Harish Shankar: ప‌వ‌న్ క‌ల్యాణ్... ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ గురించి నిర్మాత తాజా అప్ డేట్

Pawan Kalyan, Ustad Bhagat Singh
Pawan Kalyan, Ustad Bhagat Singh
ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓజీ సినిమా తర్వాత ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం గురించే. ఈ సినిమా తర్వాత ఆయన ఏ సినిమాలు చేయడానికి సంసిద్ధంగా లేరు. ఇప్పటికే దర్శకుడు హరీష్ శంకర్ మూడు వంతుల షూటింగ్ పూర్తిచేశాడని తెలుస్తోంది. ఈ సినిమాపై తాజా సమాచారం ఏమిటని.. నిర్మాత మైత్రీమూవీస్.. నవీన్ ఎర్నేని అడుగగా.. త్వరలో మంచి అప్ డేట్ ఇస్తామని తెలిపారు. దీపావళి తర్వాత కొత్త అప్ డేట్ వస్తుందని వివరించారు.
 
ఓసారి దర్శకుడు హరీష్‌ శంకర్‌ తో మాట్లాడి వివరాలు తెలియజేస్తామని తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మంత్రి బాధ్యతలతో బిజీగా వుండడంతో నవంబర్ లో మిగిలిన భాగాన్ని పూర్తిచేస్తారని సమాచారం. ఈ సినిమాలో గబ్బర్ సింగ్ లో నటించిన రౌడీ బ్యాచ్ లో అంతాక్షరి  సన్నివేశంలో పాల్గొన్న వారంతా ఇందులో వుంటున్నారు. ఓజీ అనేది పవన్ అభిమానులకోసమే తీశారని టాక్ వుంది. కానీ, ఉస్తాద్ సినిమా మాత్రం అందరినీ కనెక్ట్ అయ్యేలా వుంటుందనీ, సామాజిక అంశాలు కూడా ప్రస్తావన జరుగుతుందని తెలుస్తోంది.
 
ఈ చిత్రంలో శ్రీలీల, రాశీఖన్నా కూడా నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఉస్తాద్‌ భగత్‌ సింగ్ గ్లింప్స్‌లో భగత్‌.. భగత్‌ సింగ్‌ మహంకాళి పోలీస్‌స్టేషన్‌, పత్తర్‌ గంజ్‌, ఓల్డ్‌ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ పవన్‌ కల్యాణ్‌ స్టైల్‌ ఆఫ్‌ మ్యానరిజంతో సాగుతున్న డైలాగ్స్‌ సినిమాపై హైప్‌ క్రియేట్ చేస్తున్నాయి. ముందు ముందు రాబోయే మరింత అప్ డేట్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తుందని మరో నిర్మాత చెర్రి తెలియజేస్తున్నారు.