సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 జనవరి 2023 (10:25 IST)

ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్‌లో సంచలనం : వరల్డ్ నెం.1 స్వైటెక్ ఓటమి

iga swaitek
మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సోమవారం ఒక సంచలనం చోటుచేసుకుంది. పురుషుల సింగిల్స్‌‍లో ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ రఫెల్ నాదల్ ఇంటిదారి పట్టాడు. ఇపుడు ప్రపంచ నెంబర్ వన్ ఇగా స్వైటెక్ కూడా అదే దారిపట్టారు.
 
సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌ నాలుగో రౌండ్‌లో స్వైటెక్ 4-6, 4-6 తేడాతో ఎలెన్ రైబాకినా చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ మ్యాచ్‌‍ తొలి సెట్‌ను కోల్పోయిన స్వైటెక్ రెండో సెట్‌లో పుంజచుకున్నట్టుగా కనిపించింది. కానీ పేలవ ఆటతీరుతో ఆ సెట్‌ను కూడా కోల్పోయింది. 
 
ఫలితంగా రెండు సెట్లలోనే ఆమె ఓటమి పాలయ్యారు రైబాకినా గత యేడాది వింబుల్డన్ టైటిల్‍‌ను గెలిచి సత్తా చాటిన విషయం తెల్సిందే. ఇపుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలోనూ అదే జోరును కనపరుస్తోంది. కాగా, జెలెనా ఓస్టాపెంకో, కోకో గ్రాఫ్‌ల మధ్య జరిగే మ్యాచ్ విజేతతో క్వార్టర్‌లో ఫైనల్‌లో స్వైటెకా తలపడనుంది.