గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 15 జనవరి 2023 (20:46 IST)

నేపాల్‌లో ఘోరం... విమానం కుప్పకూలింది.. 68 మంది ప్రయాణీకులు?

flight
నేపాల్‌లో ఆదివారం ఘోరం చోటుచేసుకుంది. విమానాశ్రయంలో రన్ వేపై ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటవనలో 68 మంది ప్రయాణీకులు, నలుగురు సిబ్బంది వున్నట్లు యతి ఎయిర్ లైన్స్ ప్రతినిధి తెలిపారు. ప్రయాణీకులు కాపాడేందుకు  ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 
 
విమానాశ్రయంలో రన్ వే పై విమానం కుప్పకూలడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఖాట్మండ్ నుంచి పొఖారాకు బయలుదేరిన యతి ఎయిర్ సైన్స్ విమానం ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
విమానం డ రన్ వే పై కూలిపోవడంతో పొఖారా ఎయిర్ పోర్టును అధికారులు మూసివేశారు. విమానంలో ఉన్నవారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ప్రాణనష్టం భారీగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.