మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 6 జనవరి 2023 (14:09 IST)

రైలు ప్రయాణికుడిని చితక్కొట్టిన టీసీలు.. సస్పెండ్ చేసిన రైల్వే శాఖ

train ticket checkers
ప్రయాణ టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న ఓ ప్రయాణికుడిపై ఇద్దరు టీసీలు దాడి చేశారు. ఈ దాడిలో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనిపై రైల్వేశాఖ సీరియస్‌గా స్పందించింది. ప్రయాణికుడిపై దాడి చేసిన ఇద్దరు టీసీలను సస్పెండ్ చేసింది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, ముంబై నుంచి జైనగర్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ప్రయాణికుడు టిక్కెట్ లేకుండా జనరల్ బోగీలో అప్పర్ బెర్త్ సీట్లో కూర్చొనివున్నాడు. ఆ బోగీలోకి వచ్చిన ఇద్దరు టీసీలు ఆప్రయాణికుడితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇద్దరు టీసీల్లో ఒకరు సదరు ప్రయాణికుడిని కాలు పట్టుకుని కిందకు లాగిపడేశాడు. ఆ తర్వాత బూటుకాలితో నడుంపై తన్నగా మరో టీసీ ముఖంపై తన్నాడు. 
 
దీంతో ఇతర ప్రయాణికుులు టీసీలను నిలదీయడంతో వారు వెనక్కి తగ్గారు. ఈ దాడి ఘటనను కొందరు ప్రయాణికులు మొబైల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో రైల్వే శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు సీరియస్‌గా తీసుకుని ఇద్దరు టీసీలను సస్పెండ్ చేశారు. ఈ ఘటన దోలీ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది.