శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2022 (18:30 IST)

శ్రీ చైతన్య కాలేజీ: విద్యార్థుడిని కాలితో తన్నిన లెక్చరర్

student
student
విజయవాడ బెంచ్‌ సర్కిల్‌ సమీపంలోని శ్రీ చైతన్య కాలేజీలో దారుణ ఘటన జరిగింది. విద్యార్థిపై లెక్చరర్ చేజేసుకున్నాడు. ఈ వీడియో వైరల్‌ కావడంతో జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు క్యాంపస్‌కు వెళ్లి విచారణ జరిపారు. ఇంటర్ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి రవికుమార్, జిల్లా విద్యాశాఖ అధికారిణి రేణుకా కాలేజీకి వెళ్లి జరిగిన ఘటనపై వివరాలు సేకరించారు. 
 
ఎన్నిసార్లు చెప్పినా వినకుండా విద్యార్థి ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని తరగతి గదిలో పాటలు వింటుంటే ఆవేశంతో కొట్టిన మాట వాస్తవమేనని లెక్చరర్‌ అంగీకరించారు. 
 
విద్యార్థి మాత్రం తన దగ్గర అసలు ఇయర్‌ఫోన్సే లేవని చెబుతున్నారు. విద్యార్థుడిని కాలితో తన్నిన అధ్యాపకుడిని విధుల నుంచి తొలగించినట్టు కాలేజీ యాజమాన్యం అధికారులకు వివరణ ఇచ్చింది.