గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2022 (12:46 IST)

సెట్స్‌పైకి రజనీకాంత్ "జైలర్"

jailer
సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం "జైలర్" సోమవారం నుంచి ప్రారంభమైంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో హీరో రజనీకాంత్ జైలర్‌ పాత్రను పోషిస్తుండగా, ఇది జైలు చుట్టూత తిరిగే కథ. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చుతున్నారు. 
 
అగ్రహీరో విజయ్ - నెల్సల్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన "బీస్ట్" చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. కానీ, విజయ్ ఇమేజ్ కారణంగా ఈ చిత్రం నష్టాలను చవిచూడలేదు. ఈ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా నెల్సన్ దిలీప్ కుమార్ సూపర్  స్టార్‌ను డైరెక్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. 
 
ఇందులోభాగంగా, రజనీని జైలర్‌గా చూపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రజనీ పోస్టరును రిలీజ్ చేశారు. డిఫరెంట్ లుక్‌తో చాలా సీరియస్‌గా రజనీ ఈ పోస్టరులో కనిపిస్తున్నారు. 'బీస్ట్'లో కథ అంతా కూడా షాపింగ్ మాల్ చుట్టూ తిరిగితే, ఈ సినిమాలో కథ అంతా కూడా 'జైలు' చుట్టూ తిరుగుతుందని సమాచారం.