మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 ఆగస్టు 2025 (14:51 IST)

దేవాన్ష్ పేటీఎంకు హాజరైన నారా లోకేష్, బ్రాహ్మణి.. ఒక్క రోజు లీవు తీసుకున్నాను

Nara Lokesh
Nara Lokesh
ఏపీ మంత్రి నారా లోకేష్ తనను తాను ఒక ఆదర్శవంతమైన కొడుకుగా, ప్రజా ప్రతినిధిగా నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆయన తన కుమారుడి పారెంట్స్ మీటింగ్‌కు హాజరయ్యారు. మంత్రిగా ఇతరత్రా పనుల్లో నిమగ్నమైన నారా లోకేష్.. తన బిజీ షెడ్యూల్ నుండి సమయం కేటాయించి తన కుమారుడు దేవాన్ష్ కోసం పేరెంట్-టీచర్ మీటింగ్‌కు హాజరయ్యారు. లోకేష్, తన భార్య బ్రాహ్మణి, దేవాన్ష్‌ కలిసి సెల్ఫీ క్యాప్చర్ చేశారు. ఈ ఫోటోను ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
"ఈరోజు పేరెంట్-టీచర్ మీటింగ్‌కి దేవాన్ష్‌తో కలిసి వెళ్లడానికి ఒక రోజు సెలవు తీసుకున్నాను. ప్రజా జీవితం మిమ్మల్ని మీ కాళ్లపై ఉంచుతుంది. కాబట్టి ఇలాంటి క్షణాలు మరింత ప్రత్యేకంగా అనిపిస్తాయి. అతని చిన్న ప్రపంచం, అతని కథలు, అతని చిరునవ్వు తండ్రిత్వాన్ని నిజంగా మాయాజాలంగా చేస్తాయి. మేము నిన్ను చూసి గర్విస్తున్నాము దేవాన్ష్!" లోకేష్ రాశారు.