శుక్రవారం, 14 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (18:44 IST)

విజయ్ దేవరకొండ, పరశురామ్, దిల్ రాజు కాంబినేషన్లో చిత్రం

Vijay Devarakonda, Parasuram, Dil Raju
Vijay Devarakonda, Parasuram, Dil Raju
"గీత గోవిందం" తో బ్లాక్ బస్టర్ సాధించిన హీరో విజయ్ దేవరకొండ, పరశురామ్ లు మరో సినిమా చేయబోతున్నారు. ఈ కొత్త చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ లు ఎస్.వి.సి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. సరికొత్త కథతో తెరకెక్కనున్న ఈ చిత్రంతో విజయ్ మొదటి సారి దిల్ రాజు, శిరీష్ ల ఎస్.వి.సి క్రియేషన్స్ బ్యానర్లో పని చేయనుండడంతో చిత్రం పై అంచనాలు నెలకొన్నాయి.
 
భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన విషయాలని అధికారికంగా ప్రకటించారు. గీత గోవిందం కంటే మించిన కథతో పాటు యాక్షన్ అంశాలు ఇందు ఉంటాయని తెలుస్తోంది.  ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణుల మరియు ఇతర వివరాలని త్వరలోనే వెల్లడించనున్నారు.