మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (16:49 IST)

తెలుసా..మనసా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన దిల్ రాజు

telusa manasa team with dilraju family
telusa manasa team with dilraju family
కేరింత ఫేమ్ పార్వతీశం హీరోగా జశ్విక హీరోయిన్‌గా శ్రీబాలాజీ పిక్చర్స్, బ్యాన‌ర్‌పై వైభ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌ర్షా ముందాడ‌, మాధ‌వి నిర్మిస్తోన్న న్యూ ఏజ్ ప్లాటోనిక్ ల‌వ్ స్టోరి ‘తెలుసా..మనసా..’. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్ర‌మిది. ఓ గ్రామంలో బెలూన్స్ అమ్ముకునే యువ‌కుడు (పార్వ‌తీశం), అదే ఊర్లో ప‌ని చేసే హెల్త్ అసిస్టెంట్ సుజాత (జ‌శ్విక‌)ను ప్రేమిస్తాడు. ఇద్ద‌రికీ ఒక‌రిపై ఒక‌రికి ప్రేమ ఉంటుంది కానీ ఎప్పుడూ వారిద్ద‌రూ ఆ ప్రేమ‌ను వ్య‌క్తం చేసుకోరు. మ‌ల్లి బాబు ప‌లు సంద‌ర్భాల్లో త‌న ప్రేమ‌ను  సుజాత‌తో చెప్పటానికి ప్ర‌య‌త్నిస్తాడు. కానీ చెప్ప‌లేక‌పోతాడు. అయితే ఉన్న‌ట్లుడి మ‌ల్లి బాబు క‌ల‌లు కూలిపోతాయి. సుజాత‌కు దూరం కావాల్సి వ‌స్తుంది. మ‌రి వారిద్ద‌రూ క‌లుసుకున్నారా! అనేదే ‘తెలుసా.. మనసా..’ సినిమా. 
 
ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బుధవారం ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కి అభినంద‌న‌లు తెలిపారు. ఫ‌స్ట్ లుక్‌ను గ‌మ‌నిస్తే అందులో రోహిణి హ‌ట్టంగ‌డి మంచంపై కూర్చుని ఉంటే ఆమె ప‌క్క‌నే హీరోయిన్‌, ఓ చిన్న బాబు కూర్చుని ఉన్నారు. మంచం ప‌క్క‌నే దానికి అనుకుని పార్వ‌తీశం కూర్చుని ఏదో ఆలోచిస్తూ క‌నిపిస్తున్నారు. 
 
డెబ్యూ డైరెక్ట‌ర్ వైభ‌వ్ ‘తెలుసా..మనసా..’ చిత్రాన్ని న్యూ ఏజ్ ల‌వ్ స్టోరిగా తెరకెక్కిస్తున్నారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్  సినిమాకు సంగీత సారథ్యం వ‌హిస్తున్నారు. ప్ర‌సాద్ ఈద‌ర సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి పాపారావ్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. 
 
త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.