ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 21 జనవరి 2023 (15:12 IST)

ఎప్పుడూ గెలిచేది మంచి కథే : దిల్ రాజు

Dil Raju, Vamsi Paidipalli, Thaman, Sangeetha, kik syam
Dil Raju, Vamsi Paidipalli, Thaman, Sangeetha, kik syam
దళపతి విజయ్, వంశీ పైడిపల్లిల  వారసుడు సంక్రాంతి కానుకగా విడుదలైన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. విజయ్ సరసన రష్మిక మందన్న కథానాయిక నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జనవరి 14న తెలుగులో విడుదలైన ఈ చిత్రం ఎక్స్ ట్రార్డినరీ కలెక్షన్స్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ ని నిర్వహించింది. సక్సెస్ టూర్ లో భాగంగా వైజాగ్ లో పర్యటించిన చిత్ర యూనిట్ అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించింది.
 
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. విజయంతో పాటు గౌరవం రావాలనేది నా, దిల్ రాజు గారి ప్రయత్నం. ఊపిరి, మహర్షి అలా చేసిన చిత్రాలే. ఇప్పుడు వారసుడుతో మరోసారి మా ప్రయత్నం విజయం సాధించింది. సక్సెస్ తో పాటు గౌరవాన్ని తీసుకొచ్చింది వారసుడు. సినిమా చూసిన ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ ని ఏ రూపంలోనూ బెరీజి వేయలేం. ఈ అనుభూతి జీవితంలో మర్చిపోలేం. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. దిల్ రాజు గారు డబ్బు కంటే మర్యాద కోరుకునే నిర్మాత. సినిమా ఇంత గొప్పగా  ఉందనే ప్రసంశ వస్తుందంటే.. దీనికి కారణం దిల్ రాజు గారు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాని నిర్మించారు. విజయ్ గారు బిగ్గెస్ట్ స్టార్. ఆయన ఇమేజ్ కి సరిపడేలా ఈ కథని చేయడం ఒక సవాల్. మా టీం ఎంతో హార్డ్ వర్క్ చేసింది. తమన్ మ్యూజిక్ ఈ సినిమా సోల్. ఇంత నమ్మకం మాపై పెట్టిన విజయ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు 
 
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఎప్పుడూ గెలిచేది మంచి కథ. వంశీ అనుకున్న మంచి కథకు విజయ్ గారు తోడయ్యారు. దీంతో ఒక మంచి సినిమా ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయింది. అందుకే ఇంత గొప్ప రెవెన్యు, అప్రిషియేషన్ వస్తోంది. సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలు అద్భుతంగా ఆడటం ఇండస్ట్రీకి మంచి పరిణామం’’ అన్నారు  కిక్ శ్యామ్, తమన్,  సంగీత మాట్లాడుతూ, ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ తెలిపారు.