తన కంటే 50 ఏళ్లు చిన్నదైన మహిళకు రూ. 1.60 కోట్లిచ్చి వివాహం చేసుకున్న 74 ఏళ్ల వృద్ధుడు
ఇండోనేషియాలో ఓ వృద్ధుడు చేసుకున్న పెళ్లి చర్చనీయాంశంగా మారింది. అది కూడా కన్యాశుల్కం ఇచ్చి సదరు మహిళను వివాహం చేసుకున్నాడు. 74 ఏళ్ల ఇండోనేషియా వ్యక్తి తన కంటే 50 సంవత్సరాలు చిన్నదైన మహిళను వివాహం చేసుకోవడానికి వధువుకి కోటీ 60 లక్షల ధర చెల్లించి సంచలనం సృష్టించాడు. అక్టోబర్ 1న తూర్పు జావా ప్రావిన్స్‌లోని పాసిటన్ రీజెన్సీలో విలాసవంతమైన వివాహ వేడుక జరిగింది. ఈ వివాహంలో టార్మాన్ అనే 74 ఏళ్ల వృద్ధుడు 24 ఏళ్ల షెలా అరికాతో తన వివాహాన్ని బహిరంగంగా ప్రకటించాడు. ఆమెను పెళ్లాడేందుకు ఏకంగా కోటిన్నరకు పైగా చెల్లించారు.
సోషల్ మీడియాలో ఈ జంటకు సంబంధించి కొన్ని వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతున్న వీడియోలు వేడుకను విలాసవంతమైన వేదిక వద్ద జరిగినట్లు చూపిస్తున్నాయి. 24 ఏళ్ల వధువుకి 74 ఏళ్ల వృద్ధ వరుడు కోటిన్నర రూపాయల చెక్కును అందజేయడంతో అతిథులు హర్షధ్వానాలతో హోరెత్తించారు.