సంబంధిత వార్తలు
- టెక్ దిగ్గజం గూగుల్‌ను ఎంచుకుంది... మీ సంగతేంటి..? దుబాయ్ టెక్ కంపెనీల సీఈవోలతో కీలక భేటీ
- కర్నూలు బస్సు ప్రమాదం.. అగ్నికీలల్లో కుటుంబ సభ్యులంతా సజీవదహనం
- బంగ్లాదేశ్ జలాల్లోకి ఎనిమిది మంది మత్స్యకారులు.. ఏపీకి తీసుకురావడానికి చర్యలు
- ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుక
- విశాఖలో గూగుల్ ఆర్టిఫిషియల్ హబ్ : ప్రశంసల వర్షం కురిపించిన జేపీ
కర్నూలు ప్రమాదానికి నిర్లక్ష్యమే కారమణమా? సీఎం చంద్రబాబు హెచ్చరిక
ఏపీలోని కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి నిర్లక్ష్యమే ప్రధాన కారమణనే వార్తలు వస్తున్నాయి. వీటిపై సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరిక చేశారు. ఈ ప్రమాదంలో ఇతర రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో సమగ్ర విచారణకు ఆదేశించారు.
ఏపీ రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రవాణా శాఖ ఉన్నతాధికారులతో ఆయన దుబాయ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మృతుల వివరాలు గుర్తించి కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు.
ప్రైవేటు బస్సుల ఫిట్నెస్, సేఫ్టీ, పర్మిట్ తనిఖీలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో బస్సుల సాంకేతిక తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదానికి గురైన ప్రైవేటు బస్సు రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్, పర్మిట్ వివరాలపై పూర్తి నివేదికను కోరారు.
ట్రావెల్ బస్సు యజమానులపై హత్యా కేసులు పెడతాం : టి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
ప్రైవేట్ ట్రావెల్ బస్సు యజమానుల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికుల ప్రాణాలు నిద్రలోనే గాల్లో కలిసిపోతున్నాయని, ఇది ఎంతగానో కలిచి వేస్తుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలోని కర్నూలు వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్సందించారు. ప్రైవేట్ ట్రావెల్ యజమానుల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికు ప్రాణాలు పోతే ఇకపై వారిపై హత్యా నేరం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని ఆయన హెచ్చరించారు. ప్రయాణికుల జీవితాలతో చెలగాటం అడితే చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు.
అలాగే, రాష్ట్రంలో బస్సు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోబోతున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు మితిమీరిన వేగంతో నడుపుతున్నారని, ఈ వేగాన్ని నియంత్రించేందుకు త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్నాటక రవాణా శాఖ మంత్రులతో త్వరలో సమావేశమై అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో భద్రతా ప్రమాణాలపై చర్చిస్తామని ఆయన వెల్లడించారు. ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవస్థను నియంత్రించి ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు.
